: 57 కి.మీ. పొడవైన సొరంగమార్గంలో మొదలైన రైళ్ల రాకపోకలు


ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగమార్గం గొథార్డ్ బేస్ టన్నెల్ (జీబీటీ) లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఈ సొరంగమార్గాన్ని నిర్మించారు. దీని పొడవు ఏకంగా 57 కిలోమీటర్లు. ఈ సొరంగ మార్గం నిర్మాణానికి 17 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. దీని నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 78 వేల కోట్లు.  జూన్ లో ఈ టన్నెల్ ను లాంఛనంగా ప్రారంభించగా... నిన్నటి నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులతో నిండిన రైలు తొలిసారిగా జ్యూరిక్ నుంచి లుగానోకు వెళ్లింది. ఈ సొరంగ మార్గం తర్వాత స్థానాల్లో జపాన్ లోని సీకాన్ సొరంగం (53.9 కి.మీ.), బ్రిటన్-ఫ్రాన్స్ లను కలిపే ఛానల్ టన్నెల్ (50.5 కి.మీ.) ఉన్నాయి.   

  • Loading...

More Telugu News