: 50 లక్షలు దాటిన టీడీపీ సభ్యత్వం... తెలంగాణలో సీన్ రివర్స్
ఏపీలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వం 50 లక్షలు దాటింది. ఆదివారం సాయంత్రం నాటికి 50.07 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఏపీలో మొత్తం 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదుకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. దీంతో, తన టార్గెట్ ను టీడీపీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభ్యత్వ నమోదులో గుంటూరు, చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు తెలంగాణలో కారు వేగంతో సైకిల్ పోటీపడలేకపోతోంది. టీడీపీ బలం క్రమంగా తగ్గుతోంది. తెలంగాణ సభ్యత్వాల సంఖ్య 7.94 లక్షల నుంచి 3.7 లక్షలకు పడిపోయింది.