: వెనక్కి తగ్గని సినీనటి గౌతమి... జయ మృతిపై ప్రధాని మోదీకి మరో లేఖ


పురచ్చితలైవి జయలలిత అనారోగ్యం, మృతిపై చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో జరిగిందనే బలమైన అనుమానం పలువురిలో ఉంది. జయ మరణం పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తూ, వాటిని నివృత్తి చేయాలని కోరుతూ సినీనటి గౌతమి ఇప్పటికే ప్రధాని మోదీకి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ వ్యవహారంతో, గౌతమిపై పలువురు అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, గౌతమి ఏమాత్రం తగ్గడం లేదు. మోదీకి నిన్న మరో లేఖ రాశారు గౌతమి. తన తొలి లేఖలో తాను లేవనెత్తిన సందేహాలనే చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారని లేఖలో గౌతమి పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మోదీ నుంచి సమాధానాలను తాను ఆశిస్తున్నానని చెప్పారు. మరి, ప్రధాని ఈ విషయంలో స్పందిస్తారో? లేదో? వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News