: నేను నక్సలైట్ అయిపోతానేమోనని మా అమ్మ భయపడేది: పాటల రచయిత భాస్కరభట్ల
తాను నక్సలైట్ అయిపోతానేమోనని తన తల్లి భయపడేదని ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు మొదటి నుంచి శ్రీశ్రీ కవిత్వం అంటే చాలా ఇష్టమని చెప్పారు. తన తండ్రి అర్చకుడిగా చేసేవారని, తాను కూడా తన తండ్రికి సాయంగా ఉండేవాడినని అన్నారు. తన తండ్రికి సహాయంగా ఉండాలన్నదే అప్పట్లో తన లక్ష్యమని, అది ఏ వృత్తి అనేది పట్టించుకునేవాడిని కాదని అన్నారు. తనపై శ్రీశ్రీ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తన చిన్నప్పుడే ఒక కవిత కూడా రాశానని చెప్పారు. ఆలయంలోని హుండీ దగ్గర కూర్చుని ‘నోరు లేని హుండీకి నోట్లతో సత్కారం.. నోరారా అడిగే అర్చకుడికి ఛీ అంటూ ఛీత్కారం’ అని రాశాను. ప్రజల సమస్యలు, సాహిత్యం అంటే తనకు బాగా ఇష్టమని భాస్కరభట్ల చెప్పుకొచ్చారు.