: సెలెక్టర్లను తప్పుదోవ పట్టించడం వల్లే నాడు మిస్త్రీ చైర్మన్ అయ్యాడు: టాటా గ్రూప్ ఆరోపణలు
రతన్ టాటా వారసుడి విషయంలో సెలెక్టర్లను తప్పుదోవ పట్టించిన సైరస్ మిస్త్రీ నాడు చైర్మన్ గా ఎంపికయ్యాడని టాటా గ్రూప్ సంచలన ఆరోపణలు చేసింది. మిస్త్రీ తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, కంపెనీ అధికారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవడంపైనే దృష్టి పెట్టిన మిస్త్రీ, తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మేనేజ్ మెంట్ స్ట్రక్చర్ ను బలహీనపరిచారని టాటా సన్స్ తన తాజా లేఖలో ఆరోపించింది. రతన్ టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం 2011లో ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించారని, టాటా గ్రూప్ కోసం విస్తారమైన మేనేజ్ మెంట్ స్ట్రక్చర్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన మిస్త్రీ, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని టాటా సన్స్ ఆ లేఖలో పేర్కొంది.