: ప్రధానికి లేఖ రాసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం
తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ హింసాత్మక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఒక లేఖ రాశారు. ఈ విషయమై దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరారు. కాగా,తమిళ సెంటిమెంట్ ను అనుసరించడంతో పాటు, దివంగత సీఎం జయలలిత మాదిరిగానే శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేక విధానాన్ని కొనసాగించాలని సెల్వం నిర్ణయించినట్లు అన్నాడీఎంకే వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధానికి పన్నీర్ సెల్వం ఈ లేఖ రాసినట్లు సమాచారం.