: ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ల్యాండింగ్ సమస్య.. దారి మళ్లింపు


ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ లో ల్యాండ్ కాలేకపోయింది. ఇక్కడ జరిగే బీజేపీ పరివర్తన్ యాత్రలో మోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే, ర్యాలీ జరిగే ప్రాంతంలో పొగమంచు కారణంగా హెలికాప్టర్ ను కిందకు దించలేదు. దీంతో, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను లక్నోకు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రధాని మొబైల్ ఫోన్ ద్వారా ప్రసంగిస్తుండగా..ఆ ఫోన్ ను సభలోని లౌడ్ స్పీకర్ల వద్ద ఉంచి ప్రజలకు వినిపిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News