: ముంబయిలోని ఒక కాలనీలో కూలిన హెలికాప్టరు


ముంబయిలోని ఒక కాలనీలో హెలికాప్టరు కూలిన సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గోరేగావ్ లోని ఆరే కాలనీపై రాబిన్ సన్ ఆర్ 44 హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పైలట్ తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయని, ఘటనా స్థలి వద్దకు రెండు అగ్ని మాపక వాహనాలు చేరుకొని మంటలు ఆర్పుతున్నాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News