: సెంచరీ చేసిన వెంటనే జయంత్ యాదవ్ అవుట్


లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత టెస్ట్ జట్టు ఎనిమిదో వికెట్ ను జయంత్ యాదవ్ రూపంలో కోల్పోయింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాలుగో రోజు మ్యాచ్ లో ఒకవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో శతకాన్ని నమోదు చేయగా... జయంత్ యాదవ్ సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 196 బంతుల్లో 4 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అతడు తన వికెట్ ను కోల్పోయాడు. జయంత్ యాదవ్ కు ఇది తొలి సెంచరీ. దీంతో భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ కు దిగాడు. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ జోడీ ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత స్కోరు 8 వికెట్ల నష్టానికి 613 పరుగులుగా ఉంది. కోహ్లీ 233 పరుగులతో తన దూకుడు కొనసాగిస్తున్నాడు.

  • Loading...

More Telugu News