: వావ్ కోహ్లీ... ఈ ఘనత నీకు మాత్రమే సొంతం!


భారత టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మరే భారత క్రికెట్ కెప్టెనూ ఇంత వరకు సాధించని ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇది కోహ్లీ టెస్ట్ కెరీర్లో మూడో డబుల్ సెంచరీ. మరి ఈ రికార్డును ఇప్పటి వరకు మరే భారత కెప్టెనూ నమోదు చేయకపోవడం విశేషం. పైగా కోహ్లీ ఈ మూడు సెంచరీలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయడం మరొక విశేషం. తాజా రికార్డు అనంతరం కోహ్లీ ఆటతీరుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News