: కోహ్లీ డబుల్ సెంచరీ... సెంచరీకి చేరువలో జయంత్


ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యూచ్ లో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ కొట్టాడు. శనివారం మూడో రోజు 451 పరుగులకు ఏడు వికెట్ల నష్టం వద్ద ఆట ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం మ్యూచ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికి కోహ్లీ రెండొందల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. 302 బంతుల్లో 23 ఫోర్లతో ద్విశతకం నమోదు చేశాడు. మరోవైపు జయంత్ యాదవ్ సైతం సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం జయంత్ యాదవ్ 92 పరుగులతో, 212 పరుగులతో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. ఏడు వికెట్ల నష్టానికి 579 పరుగుల వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆటకు బ్రేక్ పడింది.

  • Loading...

More Telugu News