: ఢిల్లీలో ఓ లాయర్ కు చెందిన సంస్థ నుంచి భారీ మొత్తంలో నల్లధనం పట్టివేత
ఢిల్లీలోని ఓ న్యాయ సేవల సంస్థ కార్యాలయంలో నోట్లకట్టలు భారీగా పట్టుబడ్డాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గ్రేటర్ కైలాష్-1 ప్రాంతంలోని టీఎంటీ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా... రూ.13.56 కోట్లు వెలుగు చూశాయి. వీటిలో 2.6 కోట్ల రూపాయల విలువైన కొత్త రూ.2,000 నోట్లను కూడా గుర్తించారు. మిగిలినవి రద్దయిన పాత పెద్ద నోట్లు. పోలీసుల సమాచారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు సైతం ఈ సంస్థ కార్యాలయంలో సోదాలకు దిగారు. టీఎంటీ లాయర్ రోహిత్ టాండన్ కు చెందిన సంస్థ. రెండు వారాల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారులు లెక్కలు చూపని రూ.19 కోట్లను టాండన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన రూ.13.56 కోట్లతో కలుపుకుని చూస్తే ఇప్పటి వరకు రూ.160 కోట్ల నల్లధనం టాండన్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు అయింది.