: కూలిన మరో భవనం.. నైనిటాల్‌లో విషాదం.. 8 మంది కూలీలు సజీవ సమాధి
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి చెందిన ఘటనను మర్చిపోకముందే ఉత్తరాఖండ్‌లో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నైనిటాల్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది సజీవ సమాధి అయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాలను తొలిగిస్తున్నాయి.