: ‘వార్దా’ ఎఫెక్ట్: ఏపీలో పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపానుతో ఏపీలో జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ శారీరక దారుఢ్య పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపింది. తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం నేటి సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. తుపాను కారణంగా ఎదురయ్యే ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.