: చెన్నయ్, రాంచీ ఎయిర్ పోర్టుల్లో పట్టుబడ్డ 32 కేజీల బంగారం


ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నయ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం, జార్ఖాండ్ లోని రాంచీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తనిఖీల్లో చెన్నయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో 28 కేజీల బంగారం, రాంచీ ఎయిర్ పోర్టులో 4 కేజీల బంగారం పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి తరలించారు.

  • Loading...

More Telugu News