: బాలీవుడ్ హీరోయిన్ కు విమానంలో లైంగిక వేధింపులు
హిందీ నటి టీనా దత్తాకు విమానంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వైరల్ చేయాలని కోరూతూ ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 6న ఆమె ముంబై నుంచి రాజ్ కోట్ వెళ్లేందుకు జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ కు ముందు తన మేనేజర్ తో వర్క్ రిలేటెడ్ అంశాలు మాట్లాడుతున్నారు. ఇంతలో పక్కసీట్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చేతులతో అసభ్యకరంగా తాకాడట. దీంతో ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేయగా, అది సాధారణమేనని పేర్కొని, అతని సీట్ మార్చేశారట. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సహ ప్రయాణికులు కూడా తనకు మాటసాయం చేయలేదని వాపోతోంది. భద్రతా ఏర్పాట్లు చేయరా? అంటూ ఆమె జెట్ ఎయిర్ వేస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు తాను జెట్ ఎయిర్ వేస్ విమానాల్లోనే ప్రయాణించే దానినని, ఇకపై అలా ప్రయాణించనని ఆమె చెప్పింది. ఇలాంటి ఘటనలపై ప్రశ్నించాలని చెప్పిన ఆమె, దీనిని వైరల్ చేయాలని సూచించింది. మహిళలకు భద్రత అవసరమని చెప్పింది. కాగా, టీనా దత్తా 'చోకర్ బాలి', 'పరిణీత' వంటి సినిమాల్లో నటించింది.