: చిత్రదుర్గలో దొరికిన డబ్బు, బంగారం సీనియర్ నటుడివా?


కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ మధ్యాహ్నం ఇన్ కమ్ టాక్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఒక వ్యక్తి బాత్రూంలోని రహస్య షెల్ఫ్ లో 5.7 కోట్ల రూపాయల 2000 రూపాయల నోట్లు, 90 లక్షల రూపాయల 1000, 500 రూపాయల నోట్లు, 32 కేజీల బంగారం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ డబ్బును కన్నడ సినీ నటుడు దొడ్డన్న అల్లుడు వీరేంద్ర ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు దొడ్డన్నదేనా? లేక అతని అల్లుడు వీరేంద్రదా? అన్న అనుమానాలు అందర్లోనూ రేగుతున్నాయి. కాగా, ఈ ఘటనలో వీరేంద్రతో పాటు దొడ్డన్న తమ్ముడు నాగరాజును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News