: పెద్దఎత్తున దారి మళ్లుతున్న కొత్తనోట్ల దృష్ట్యా బ్యాంకులను తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర సర్కారు!


బ్యాంకుల నుంచి నగదు సామాన్యులకి అందకుండా నల్లకుబేరులకు మళ్లుతూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పట్టుబడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లపై సీరియస్ అయింది. ఈ అంశంపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ బ్యాంకర్లను తీవ్రంగా హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బు మళ్లించే ప్రయత్నం చేస్తే తాము ఎవ‌రినీ వ‌ద‌ల‌బోమ‌ని త‌మ నుంచి ఎవ‌రూ తప్పించుకోలేరని హెచ్చరించింది. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారిపై తాము క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపింది. ఇప్ప‌టికే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నల్లకుబేరుల నుంచి క‌మీష‌న్ తీసుకుని డ‌బ్బును పంచేసిన 27 మంది ప్రభుత్వ బ్యాంకు అధికారులను కేంద్ర స‌ర్కారు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంత‌రం ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకుకు చెందిన 19 మంది అధికారులపై కూడా వేటు ప‌డింది. విస్తృతంగా త‌నిఖీలు జ‌రుపుతూ ఎటువంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఎప్ప‌టికైనా త‌మ ఆగ్ర‌హానికి గురి కావల‌సిందేన‌ని హెచ్చరిక‌లు చేస్తోంది.

  • Loading...

More Telugu News