: నేను బేసిక్స్ కి కట్టుబడ్డాను...పుజారా, కోహ్లీతో బ్యాటింగ్ చేయడం బాగుంటుంది: మురళీ విజయ్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాతో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంటుందని, దానిని బాగా ఆస్వాదిస్తానని సెంచరీ హీరో మురళీ విజయ్ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ, తాను బేసిక్స్ కు కట్టుబడి ఆడడం వల్లే సెంచరీ సాధించగలిగానని అన్నాడు. గత సిరీస్ ముగిసిన అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకోలేదని, తీవ్రంగా ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. బలహీనతపై దృష్టి పెడుతూనే తన బలాలను పెంచుకున్నానని చెప్పాడు. షార్ట్ పిచ్, బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తనపై దాడి చేస్తారని భావించానని, తాను భావించినట్టే వారి నుంచి తనకు షార్ట్ పిచ్, బౌన్సర్లు స్వాగతం పలికాయని అన్నాడు. అయితే వాటిని దీటుగా ఎదుర్కొని సెంచరీ చేయడం సంతోషాన్నిచ్చిందని విజయ్ తెలిపాడు.