: సుష్మస్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం


గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఎయిమ్స్ లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. సుమారు నెల రోజుల నుంచి ఎయిమ్స్ లో కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. అయితే వారి కిడ్నీలు ఆమెకు సూట్ కాకపోవడంతో వైద్యులు నిరీక్షించాల్సి వచ్చింది. తాజాగా దాత కిడ్నీ సూట్ కావడంతో ఎయిమ్స్ లో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. కాగా, సుష్మ, దాత ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News