: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిని పటియాలా హౌజ్‌కోర్టుకు తరలించిన సీబీఐ అధికారులు
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిన్న వైమానిక దళ మాజీ అధిపతి ఎస్.పి.త్యాగిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయనను ఢిల్లీలోని పటియాలా హౌజ్‌కోర్టులో విచారణకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగిలను కూడా అధికారులు కోర్టుకి తరలించారు. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా త్యాగి సాయం అందించాడని, అగస్టా మధ్యవర్తులతో త్యాగి సోదరులకు కూడా పరిచయాలు ఉన్నాయని, ఈ వ్యవహారం కోసం ముడుపులు పుచ్చుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఈ కుంభకోణం జరిగింది.