: పెళ్లి కొడుకైన టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ


టీమిండియా ఆటగాళ్లంతా ముద్దుగా లంబూ అని పిలుచుకునే పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ నిన్న ఓ ఇంటివాడయ్యాడు. క్రికెటర్ ఇషాంత్ శర్మ బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. 2011లో బాస్కెట్ బాల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇషాంత్ అప్పుడు భారత్ బాస్కెట్ బాల్ జట్టు కెప్టెన్ గా ఉన్న ప్రతిమా సింగ్ తో ప్రేమలో పడ్డాడు. గత జూన్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వివాహం జరిగింది. ఈ వివాహానికి టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. యువరాజ్ వివాహం గతవారమే జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News