: జయలలిత మృతి తట్టుకోలేక తమిళనాడులో 280 మంది మృతి


జయలలిత మరణవార్తను గురించి తెలుసుకొని తట్టుకోలేక తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 280 మంది మృతి చెందినట్లు అన్నాడీఎంకే పార్టీ ఈ రోజు ప్ర‌క‌టించింది. త‌మ పార్టీ త‌ర‌ఫున మృతుల కుటుంబాలకు ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు పేర్కొంది. మృతి చెందిన వ్య‌క్తుల కుటుంబాల‌కు రూ.3 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపింది. జ‌య‌ల‌లిత క‌న్నుమూశార‌ని తెలుసుకొని ప్రాణాలు కోల్పోయిన వారి తాజా జాబితాను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 77 మంది మృతుల పేర్లను ప్రకటించిన అన్నాడీఎంకే శ్రేణులు తాజా జాబితాలో మ‌రో 203 మంది పేర్లను పేర్కొన్నాయి. దీంతో మొత్తం క‌లిపి మృతుల సంఖ్య 280గా తెలిపింది. మృతుల కుటుంబాల‌కు త‌మ‌ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. మృతుల‌తో పాటు ఆమె కోసం ఆత్మాహుతి యత్నం చేసిన వ్య‌క్తికి, అమ్మ కోసం చేతి వేళ్లు తెగకోసుకున్న మరో వ్య‌క్తికి కూడా తాము ప‌రిహారంగా రూ.50 వేలు చొప్పున ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News