: ఉపన్యాసాలు దంచడం తప్ప మోదీ వద్ద ఏమీ లేదు: మమతా బెనర్జీ
ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మోదీపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మంచి రోజులు వస్తాయని మోదీ చెబుతున్నప్పటికీ... ప్రజలెవరూ ఆయన మాట నమ్మడం లేదని దీదీ చెప్పారు. సామాన్యుల కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయని విమర్శించారు. నోట్ల రద్దు అంశం గురి తప్పిందన్న సంగతి మోదీబాబుకు కూడా తెలుసని ఆమె ట్వీట్ చేశారు. ఉపన్యాసాలు దంచడం తప్ప... ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఆయన వద్ద ఎలాంటి పరిష్కార మార్గం లేదని చెప్పారు.