: థానేలో 143 సెల్ ఫోన్ టవర్లకు సీలు వేసిన కలెక్టర్
మహారాష్ట్రలోని థానేలో ఉన్న 143 సెల్ ఫోన్ టవర్లకు కలెక్టర్ కళ్యాణకర్ సీలు వేశారు. వివరాల్లోకి వెళ్తే, నవీ ముంబై, థానే, మీరాభాయేందర్ ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్లపై ఏర్పాటు చేసిన సెల్ టవర్లపై భూ ఆదాయ చట్టం ప్రకారం పన్ను కట్టాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా, యజమానులు మాత్రం స్పందించలేదు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో థానే తహశీల్దారు 143 సెల్ టవర్లకు సీలు వేశారు. వాస్తవానికి 2,169 టవర్లు ఉండగా, వాటిలో కేవలం 23 టవర్లకు మాత్రమే అనుమతి ఉందట. దీంతో, అక్రమ సెల్ టవర్ల నుంచి రూ. 5.69 కోట్ల ఆదాయాన్ని వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.