: మురళీ విజయ్ ఔట్... కోహ్లీ హాఫ్ సెంచరీ
ముంబై టెస్టులో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ సాధించాడు. 282 బంతులను ఎదుర్కొన్న మురళీ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. అనంతరం రహీద్ బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్ లో కెప్టెన్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ (51), కేకే నాయర్ (7) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంకా 121 పరుగులు వెనుకబడి ఉంది.