: అదుపుతప్పి బోల్తా పడిన స్కూలు బస్సు... ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమం
విశాఖపట్నంలోని తొట్లకొండ వద్ద రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళుతున్న సమయంలో స్కూలు తొట్లకొండ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయాలతో బాధపడుతున్న చిన్నారులను దగ్గరలోని గీతమ్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.