: పెళ్లి చూపుల మధ్యలో వచ్చి అమ్మాయిని ముద్దాడిన ప్రియుడు.. హ్యాపీ ఎండింగ్!
పెళ్లిచూపులు జరుగుతుండగా అక్కడకు వచ్చిన ఓ యువకుడు అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా బక్కన్నపాలెం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయికి నిన్న పెళ్లిచూపులు పెట్టుకున్నారు. పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలో, హఠాత్తుగా అక్కడకు ఓ యువకుడు వచ్చి అమ్మాయిని ముద్దుపెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని అతను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద కుటుంబానికి చెందిన చెందిన వాడు అతను. జరిగిన ఘటనతో మగపెళ్లివారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు ఒప్పించాడు. వారి వివాహానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.