: జయలలిత ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంటుంది: అన్నాడీఎంకే నేత పొన్నయన్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉన్నప్పుడు తమ పార్టీ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంటుందని అన్నాడీఎంకే నేత సి.పొన్నయన్ అన్నారు. ఈ రోజు చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తమపార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. తాము జయలలిత మార్గంలోనే ముందుకు వెళతామని, అన్నాడీఎంకే పార్టీలో ప్రధాన కార్యదర్శి కోసం ఎలాంటి ఎన్నికలు ఉండవని తేల్చిచెప్పారు. జయలలిత తమతో లేకపోయినప్పటికీ అన్నాడీఎంకే పార్టీ ఐక్యంగా నడుస్తుందని ఆయన చెప్పారు. జయలలిత ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను తాము కొనసాగిస్తామని పేర్కొన్నారు.