: నాంపల్లి వద్ద వారం పాటు ట్రాఫిక్ ఆంక్షలు... నరకం చూస్తున్న జనాలు


హైదరాబాదులోని నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మెట్రో అధికారుల అభ్యర్థన మేరకే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న రోజుల్లో కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే ఆ మార్గంలో అనుమతిస్తారు. అబిడ్స్, కోఠి నుంచి వచ్చే ఇతర వాహనాలన్నింటినీ నాంపల్లి టి జంక్షన్ వైపు రాకుండా... ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరోవైపు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News