: బీభత్సం సృష్టించిన వీధి వ్యాపారులు.. పరస్పర దాడి.. ఒకరి మృతి
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వీధి వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని బీభత్సం సృష్టించిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఓ వ్యాపారి మరణించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మీడియాకు వివరాలు తెలిపారు. వ్యాపారులు చేసుకున్న పరస్పర దాడిలో మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్ను కర్రతో కొట్టి చంపి ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దిలీప్దాస్ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు కాగా, నిందితుడు మజీద్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.