: రోడ్డు ప్రమాదానికి గురైన రామ్ చరణ్ అభిమానులు... ఇద్దరి మృతి, 12 మందికి తీవ్ర గాయాలు


తమ అభిమాన హీరో రామ్ చరణ్ తాజా చిత్రం 'ధృవ' సినిమా చూసి వస్తూ... రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయన అభిమానులు. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. నిన్న రాత్రి వావిలాలకు చెందిన రామ్ చరణ్ అభిమానులు సినిమా చూడ్డానికి వెళ్లారు. సినిమా చూసిన తర్వాత ఆటోలో వారు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా, పందెపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ వారి ఆటోను ఢీకొట్టింది. దీంతో, రాజు, సతీష్ అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడ్డ మరో 12 మందిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News