: మరింత పడిపోయిన బంగారం ధర


పెద్దనోట్ల రద్దు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మరింత పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర మరింత పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 అనంత‌రం పసిడికి ఇదే కనిష్ఠ స్థాయి. బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మ‌రో 130 రూపాయ‌లు త‌గ్గి రూ.28,580 గా ఉంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బంగారు ఆభ‌ర‌ణాల వ‌ర్త‌కుల డిమాండ్ ప‌డిపోయింద‌ని, దానికితోడు బలహీన అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధ‌ర‌ 10 నెలల కనిష్ఠానికి ప‌డిపోయింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక‌, సింగపూర్‌లో ఔన్సు పసిడి ధర 0.15 శాతం పెరిగి 1,168.60 డాలర్లకు చేరింది. మ‌రోవైపు ప్ర‌స్తుతం వెండి ధ‌ర మాత్రం కేజీకి రూ.250 పెరిగి రూ.41,850 వద్ద ముగిసింది.

  • Loading...

More Telugu News