: జయలలితకు వైద్యం చేసినందుకు అపోలో వేసిన బిల్లు... చూస్తే అవాక్కే!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తనకు అనారోగ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరి, ఆపై 75 రోజుల అనంతరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె చికిత్సకు అపోలో ఆసుపత్రి వేసిన బిల్లెంతో తెలుసా?... అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు. అంటే రోజుకు కోటి రూపాయలకు పైగానే. స.హ చట్టాన్ని వినియోగించి ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో రూ.6 కోట్ల మొత్తం చెల్లించింది కూడా. ఆసుపత్రి ఖర్చంతటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. జయలలితను ఆసుపత్రి రెండో అంతస్తులో ఉంచగా, అందులోని మిగతా గదులన్నీ ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గదులన్నింటి అద్దెతో పాటు లైఫ్ సపోర్ట్ యాంత్రాల అద్దెలు, 39 మంది వైద్యులకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, లండన్ నుంచి పలుమార్లు వచ్చి వెళ్లిన డాక్టర్ రిచర్డ్ బిలే, అతని టీమ్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే బిల్లు జాబితా చాంతాడంత ఉంది. జయలలిత గుండె ఆగిన తరువాత అమర్చిన ఎక్మో యంత్రానికి అద్దె రోజుకు కోటి రూపాయలుగా అపోలో వేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News