: తెలంగాణకు వర్షసూచన.. 12, 13 తేదీల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్దా తుపాను కోస్తా తీరం దాటిన తర్వాత బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో 12, 13 తేదీల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.