: టీఎస్ ఆర్టీసీలో నేటితో పాత నోట్లకు చెక్.. రూ.500, వెయ్యి నోట్లను అనుమతించబోమని ప్రకటన
పెద్దనోట్ల రద్దు తర్వాత పాత నోట్లను అనుమతిస్తూ వస్తున్న టీఎస్ ఆర్టీసీ ఇక నుంచి పెద్ద నోట్లను తీసుకోబోమని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర వెంకటరమణారావు పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా శుక్రవారం వరకు రద్దయిన పాత నోట్లను అనుమతించామని, శనివారం ఉదయం నుంచి వాటిని ఇక అనుమతించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రయాణికులు, విద్యార్థులు తమకు సహకరించాలని కోరారు.