: నాకు టెక్నాలజీ తెలియదు కానీ, ఎలా ఉపయోగించాలో మాత్రం తెలుసు: సీఎం చంద్రబాబు


తనకు టెక్నాలజీ తెలియదనీ, అయితే వేటిని ఎలా ఉపయోగించాలో మాత్రం తెలుసని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లినీ కలిసిన చంద్రబాబు, పెద్దనోట్ల రద్దు అనంతరం ఏపీలో పరిణామాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్.. ఐ నో ఎవిరిథింగ్.. ఐ నో ద బెనిఫిట్స్ ఆఫ్ టెక్నాలజీ. బట్, నేను ఆపరేటర్ ను కాదు.. ప్రోగ్రామర్ ని కాదు. నేను టెక్నాలజీ మేనేజర్ ని. నా గవర్నమెంట్ అంతా నా కంప్యూటర్ లో ఉంది. ఎక్కడ బల్బు ఆరిపోయింది, గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఎలా ఉంది, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి.. అన్ని విషయాలు నా కంప్యూటర్లో ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అత్యుత్తమ విధానాలను తీసుకువస్తాం’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News