: సుష్మా స్వరాజ్ కు రేపు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్?
కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ రేపు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. రేపు ఉదయం 8.30 గంటల సమయంలో ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగనుందని పేర్కొంది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే వైద్యబృందంలో ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసి మిశ్రా, సర్జన్లు వీకే బన్సాల్, సందీప్ అగర్వాల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సర్జన్లు మాత్రమే కాకుండా, సుష్మ ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇతర విభాగాలకు చెందిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారని, ఆమెకు కిడ్నీ దానం చేస్తున్నది బయటి వ్యక్తేనని ఆ కథనంలో పేర్కొంది. కాగా, మధుమేహంతోను, కిడ్నీ సంబంధిత వ్యాధితోను బాధపడుతున్న సుష్మాస్వరాజ్ కు డయాలసిస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.