: పెద్ద‌ మొత్తంలో వ‌స్తున్నాయి.. కొత్త నోట్లకు ఈ నెల 15 తర్వాత కొరత ఉండదు: మ‌ంత్రి ప్ర‌త్తిపాటి


పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న క‌ష్టాలు ఇక తీర‌నున్నాయ‌ని రాష్ట్ర మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్‌బీఐ గవర్నర్‌తోనూ, బ్యాంకర్లతోనూ మాట్లాడారని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున రూ.500 నోట్లు రానున్నాయని అన్నారు. ఈ నెల 15 తరువాత కొత్త‌నోట్ల‌కు కొరత ఉండదని తెలిపారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోవ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహ‌న్‌రెడ్డి కంగు తిన్నాడని, దీంతో ఆయనకు మతి కూడా భ్రమించిందని ప్రత్తిపాటి విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోదీ తీసుకున్న సంచ‌ల‌న‌ నిర్ణ‌యాన్ని న‌ల్ల‌కుబేరులు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని, సామాన్య ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News