: రేపు భేటీ కానున్న తమిళనాడు కొత్త కేబినెట్
తమిళనాడు కొత్త కేబినెట్ రేపు భేటీ కానుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో రేపు ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లో జరగనున్న ఈ సమావేశంలో తొలుత దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సమావేశం అనంతరం కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి జయలలిత మృతి వార్త ప్రకటన అనంతరం, తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం, మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.