: అమీర్ ఖాన్ పాత్రకు రజనీకాంత్ డబ్బింగ్ చెప్పనన్నారట!
క్రిస్మస్ కానుకగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘దంగల్’ విడుదల కానుంది. ప్రముఖ మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తమిళ వెర్షన్ లో అమీర్ పాత్రకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను డబ్బింగ్ చెప్పమని కోరారట. అయితే, తాను బిజీగా ఉన్న కారణంగా, డబ్బింగ్ చెప్పడం కుదరదని రజనీ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ‘రజనీ కాంత్ సార్ కోసం ‘దంగల్’ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ప్రదర్శించారు. తమిళ్ వెర్షన్ ‘దంగల్’లో తన పాత్రకు రజనీ సార్ ను డబ్బింగ్ చెప్పాల్సిందిగా అమీర్ కోరారు. అయితే, రజనీ సార్ సున్నితంగా తిరస్కరించారు’ అని రజనీకాంత్ సన్నిహిత వర్గాల సమాచారం. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ చిత్రం షూటింగ్ లో రజనీకాంత్ బిజీగా ఉండటం వల్లే అమీర్ చిత్రంలో డబ్బింగ్ చెప్పేందుకు తిరస్కరించారని సమాచారం.