: పెద్దనోట్ల కుంభకోణం.. తపాలా సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుకు రిమాండ్ విధించిన కోర్టు


పెద్దనోట్ల మార్పిడి వ్యవహారానికి సంబంధించి తపాలా సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుపై సీబీఐ 3 కేసులు నమోదు చేసింది. వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుని పెద్దనోట్ల మార్పిడికి పాల్పడినట్లు సీబీఐ తేల్చింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన నితిన్, నర్సింహారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో వీరిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నెల 23 వరకు ముగ్గురికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, పెద్దనోట్ల మార్పిడిలో రూ.3 కోట్ల అవకతవకలకు సుధీర్ బాబు పాల్పడినట్లు సీబీఐ అభియోగం. ఈ అవకతవకల వెనుక ఉన్న అసలు సూత్రధారిని పట్టుకునేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది.

  • Loading...

More Telugu News