: నా పుట్టినరోజు వేడుకలు జరపకండి: అభిమానులతో రజనీకాంత్


ఈ నెల 12వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని అభిమానులను ఆ లేఖలో రజనీ కోరారు. కాగా, ఈ నెల 5న తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల సంతాపదినాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రజనీ కాంత్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దంటూ తన అభిమానులను కోరడం జరిగింది.

  • Loading...

More Telugu News