: ఇంగ్లండ్ కు దీటుగా సమాధానమిస్తున్న టీమిండియా


ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కు టీమిండియా దీటుగా సమాధానమిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ ను కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ప్రారంభించారు. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేఎల్ రాహుల్ మొయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మురళీ విజయ్ కు పుజారా జత కలిశాడు. ఆ తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో మురళి 70 పరుగులు, పుజారా 47 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ 7 మంది బౌలర్లను మార్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. అంతకు ముందు ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులతో ఇంగ్లండ్ రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించింది. భారత స్పిన్నర్లు అశ్విన్ 6 వికెట్లు, జడేజా 4 వికెట్లతో రాణించినప్పటికీ... ఇంగ్లండ్ 400 పరుగులు చేసి, మంచి స్థితిలో నిలిచింది. రేపటి ఆటలో తొలి రెండు సెషన్లు అత్యంత కీలకం కానున్నాయి. బంతి బాగా టర్న్ అయితే మాత్రం మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News