: ముంచుకొస్తోన్న వార్ధా తుపాను.. సోమవారం తీరం దాటే అవకాశం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపుగా వార్ధా తుపాను ముంచుకొస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 1090 కి.మీల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంద‌ని, సోమ‌వారం నెల్లూరు, కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం ఉంద‌ని ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. రేపటి నుంచి జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని తెలిపింది. ఇప్పటికే సముద్రంలోకి చేప‌ల వేట‌కు వెళ్లిన జాలర్లు తిరిగి తీరానికి చేరుకోవాలని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం పోర్టు బ్లేయిర్ కు పశ్చిమంగా 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఈ నేప‌థ్యంలో తుపాను తీరం దాటే సమయంలో 65-75 కీమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో మ‌త్స్య‌కారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News