: బ్యాంకు ఎదుట బీభత్సం.. క్యూలో ఉన్న 15 మందిపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు!


మ‌హారాష్ట్రలోని సోలాపూర్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎదుట ఈ రోజు ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ్యాంకు నుంచి డ‌బ్బు డ్రా చేసుకోవ‌డానికి ఖాతాదారులు స‌ద‌రు బ్యాంకు ముందు బారులు తీరి నిల‌బడ్డారు. అదే స‌మ‌యంలో అటుగా వెళుతున్న ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి క్యూలో నిల‌బ‌డిన ఖాతాదారుల వైపుకు దూసుకొచ్చి, వారిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది ఖాతాదారుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు, ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌రును అదుపులోకి తీసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News