: ప్రపంచంలోని టాప్ 10 పవర్ ఫుల్ భాషలు ఇవిగో!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 6 వేల భాషలను మాట్లాడుతున్నారు. వీటిలో 2 వేల భాషలను మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ భాషలను వెయ్యి మంది కన్నా తక్కువ మాట్లాడుతున్నరు. తొలి నాళ్లలో భావ వ్యక్తీకరణ కోసం మొదలైన భాష, ఆ తర్వాత సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిన నేపథ్యంలో, భాషకున్న ప్రాధాన్యత ఎంతో పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోని 6 వేల భాషల్లో ఏ భాషలు అత్యంత శక్తిమంతమైనవనే విషయాన్ని నిపుణులు లెక్కించారు. ఒకవేళ గ్రహాంతరవాసులు భూమిపైన అడుగు పెడితే... వారు ఏ భాష నేర్చుకుంటే మనతో ఈజీగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలరు? అనే విషయాన్ని అంచనా వేశారు. జాగ్రఫీ, ఎకానమీ, కమ్యూనికేషన్, నాలెడ్జ్, డిప్లొమసీ అన్న క్యాటగిరీలను పరిగణనలోకి తీసుకుని శక్తివంతమైన భాషలను లెక్కించారు. ఈ జాబితాలో ఇంగ్లీష్ తొలి స్థానంలో నిలవగా, మాండరిన్ (చైనాలోని ప్రధాన ప్రాంతీయ భాష) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రష్యన్, జర్మన్, జపనీస్, పోర్చుగీస్ భాషలు నిలిచారు. హిందీ పదవ స్థానాన్ని ఆక్రమించింది. 2050 నాటికి ఈ జాబితాలో ఏయే మార్పులు చోటు చేసుకోవచ్చో కూడా నిపుణులు అంచనా వేశారు. అన్ని స్థానాలు పదిలంగానే ఉంటాయని... అయితే, మూడో స్థానానికి స్పానిష్ చేరుకోవచ్చని, తొమ్మిదో స్థానాన్ని హిందీ ఆక్రమించవచ్చని భావిస్తున్నారు.