: నానక్ రామ్ గూడ మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సంఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం కింద రూ.5 లక్షల నష్టపరిహారం, గాయాలైన వారికి రూ.2 లక్షలు, దహన సంస్కారాలకు రూ.20 వేల సాయం చేయనుంది. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలిస్తామని ఏపీ సర్కార్ ఆ ప్రకటనలో పేర్కొంది.