: కూలిన భవనం నిర్మించిన బిల్డర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మంత్రి మహేందర్ రెడ్డి


హైదరాబాద్ నానక్ రాంగూడలో భవనం నిర్మించిన బిల్డర్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. భవనం కూలిన సంఘటనపై ఆయన స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారని అన్నారు. భవన యజమాని మంత్రికి స్నేహితుడు కావడం వల్లే ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తడాన్ని ఆయన కొట్టిపారేశారు. కాగా, నానక్ రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం నిన్న రాత్రి కుప్పకూలింది. నిర్మాణ పనుల కోసం వచ్చిన నాలుగు కుటుంబాలు ఈ భవనంలోనే నివాసముంటున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు.

  • Loading...

More Telugu News