: అధికారాలు కోల్పోయిన దక్షిణకొరియా అధ్యక్షురాలు
దక్షిణకొరియా అధ్యక్షురాలు పార్క్ గియున్ హైపై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో, ఆమెపై జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. అధ్యక్షురాలిగా పార్క్ గియున్ కు ఉన్న అధికారాలన్నింటినీ తొలగించి... ప్రధానికి బదిలీ చేస్తూ జాతీయ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే ఆమెను పదవి నుంచి పూర్తిగా తొలగించాలా? వద్దా? అనే విషయాన్ని రాజ్యాంగ కోర్టు నిర్ణయించనుంది. అప్పటి వరకు ఆమె అధ్యక్షపదవిలో కొనసాగుతారు.